‘కుంకుమలా’ మారిన Alia Bhatt, రణ్‌బీర్ కపూర్‌ల ‘కేసరియా’

Published: Fri, 27 May 2022 17:43:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కుంకుమలా మారిన Alia Bhatt, రణ్‌బీర్ కపూర్‌ల కేసరియా

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్( Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’(Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్(Karan Johar) నిర్మాతగా వ్యవహరించారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. దక్షిణాది భాషలకు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి  సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.


‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ త్వరలోనే విడుదల కాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ‘కుంకుమలా’(Kumkumala) పాటను విడుదల చేశారు. ఈ పాటను ఎస్ఎస్.రాజమౌళి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సాంగ్ లిరిక్స్‌ను చంద్రబోస్ రాశారు. సిద్ శ్రీరామ్ అలపించారు. ‘బ్రహ్మాస్త్ర’ హిందీ వెర్షన్ నుంచి గతంలోనే మేకర్స్ ‘కేసరియా’ అనే పాటను రిలీజ్ చేశారు. ఆ పాటకు తెలుగు వెర్షనే ‘కుంకుమాలా’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, మౌనిరాయ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు.  Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International