
ఏలూరు/ఆకివీడు : వైసీపీ మండలాధ్యక్ష పదవికి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశానని కేశిరెడ్డి మురళీ మంగళవారం తెలిపారు. నగర పంచాయతీ ఎన్నికల ముందే మండలాధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు నియోజకవర్గ ఇన్‌చార్జి గోకరాజు రామరాజుకు పత్రాన్ని అందజేశానన్నారు. నేతల ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగిందన్నారు. పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉంటానని తెలిపారు.