నా కొడుక్కి కొత్త జీవితం కావాలి....

ABN , First Publish Date - 2021-08-13T21:05:40+05:30 IST

మూడేళ్ళ వయసున్న నా ముద్దుల బాబును తనివితీరా హత్తుకున్నాను. నా కడుపున పుట్టిన నా కొడుకు తరుణ్ నులివెచ్చని దేహంలోని మాధుర్యాన్ని ఆనందించడం ఇదే చివరిసారి అవుతుందేమోనని భయమేస్తోంది....

నా కొడుక్కి కొత్త జీవితం కావాలి....

మూడేళ్ళ వయసున్న నా ముద్దుల బాబును తనివితీరా హత్తుకున్నాను. నా కడుపున పుట్టిన నా కొడుకు తరుణ్ నులివెచ్చని దేహంలోని మాధుర్యాన్ని ఆనందించడం ఇదే చివరిసారి అవుతుందేమోనని భయమేస్తోంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే... తరుణ్‌తో నా మాతృత్వపు మధురిమలను ఆనందించే క్షణాలు దూరం కాబోతున్నాయా? అనే భీతి కలుగుతోంది. పుట్టినప్పటి నుంచీ నా కొడుకు ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నాడు. వాడు అంత బాధపడుతుంటే నా హృదయం ద్రవించిపోతోంది. కానీ, ఏమీ చెయ్యలేని దుస్థితి నాది. పేదను... నిస్సహాయురాలిని. నా చేతులు కట్టేసి ఉన్నాయి. నా కొడుకును కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను కానీ... కఠిన వాస్తవాలైన నా పేదరికం, శక్తిహీనత నా ముఖం మీదే చాచి కొడుతున్నాయి.


ఈ లింక్‌పై క్లిక్ చేసి తరుణ్ వైద్యానికి సాయం చెయ్యండి...


తరుణ్ పుట్టినప్పుడు, ఈ ప్రపంచంలో నేను మాత్రమే సంతోషంగా ఉన్నాననిపించింది. నా పసిపాపడి చిరునవ్వులోని వెలుగులు ఎంతో ప్రకాశిస్తుంటే... నేనెంతో పరవశించిపోయేదాన్ని. దురదృష్టవశాత్తు, నేను, నా బాబు ఆనందంగా ఉండటం చూసి ఆ విధికి కన్ను కుట్టినట్టుంది. 


జనవరి 2020లో మా జీవితాలు రాత్రికి రాత్రి తల్లకిందులయ్యాయి. తరుణ్ ఒంట్లో వేడి రాన్రానూ పెరిగిపోతోంది. అంతే వేగంగా బరువు తగ్గిపోతున్నాడు. వాడి ఒళ్లు పాలిపోయి, నడవలేని పరిస్థితి వచ్చింది. బాబును దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాం. డాక్టర్ వెంట వెంటనే చాలా పరీక్షలు చేశారు. ఆస్పత్రి బయట నేను ఓపిగ్గా వేచి ఉండి, నా కొడుకు క్షేమం కోసం దేవుణ్ణి ప్రార్థించాను. కానీ, నా ప్రార్థన ఫలించలేదు. పరీక్షలు చేశాక డాక్టర్ చెప్పింది విని నా గుండె పగిలిపోయింది. "మీ అబ్బాయి తరుణ్ acute myeloid Leukemiaతో బాధ పడుతున్నాడు. ఇదొక ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్. బాబుకు వీలైనంత త్వరగా కీమోథెరపీ చెయ్యకపోతే బతకడం కష్టం" అని నాకు, నా భర్తకు చెప్పారు.


ఈ లింక్‌పై క్లిక్ చేసి తరుణ్ వైద్యానికి సాయం చెయ్యండి...


డాక్టర్ చెప్పింది విని నేను షాక్ తిన్నాను. నేను విన్నది నమ్మలేని స్థితిలో ఉన్నాను. మీరు చెప్పేది నిజమేనా? అని అడిగాను. నన్ను నిరుత్సాహపరుస్తూ... ఆయన తలాడించారు. ఇక ఆ రోజు నుంచీ నా కొడుకుని రక్షించుకోవడానికి చెయ్యాల్సిందంతా చేస్తున్నాను. నా బ్రతుకు నరకంలా మారిపోయింది. నా కొడుక్కి వైద్యం చెయ్యడానికి సుమారుగా రూ.20 లక్షలు ($ 26723.14) ఖర్చవుతుందని చెప్పారు. నా భర్త చేసే పని, మాకొచ్చే ఆదాయం అంతా చూసుకుంటే.... ఇది మేం భరించలేనంత మొత్తం అని అర్థమైంది.



ఈ పరిస్థితుల్లో సాయం కోసం అర్థించడం తప్ప నాకు మరో అవకాశం లేదు. మేం అప్పు చేసే పరిస్థితి కూడా లేదు. మావైపు చూసేవారూ లేరు. నా కొడుక్కి చికిత్స కోసం దయచేసి పెద్ద మనసు చేసుకుని మీవల్ల అయినంత ఆర్థిక సాయం చెయ్యండి. మీరిచ్చే ప్రతి పైసా ఆ క్యాన్సర్ పై పోరాటానికే ఉపయోగిస్తాం.... ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను.

Updated Date - 2021-08-13T21:05:40+05:30 IST