ఉద్యోగసంఘాల భేటీలో కీలక నిర్ణయాలు

Published: Fri, 21 Jan 2022 18:30:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉద్యోగసంఘాల భేటీలో కీలక నిర్ణయాలు

అమరావతి: పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన సర్కారుపై  ‘సమ్మె అస్త్రం’ ప్రయోగించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. వేర్వేరు సంఘాలన్నీ ఉమ్మడిగా కలిసి వచ్చి... ఉద్యమించాలని నిర్ణయించుకున్నాయి. పీఆర్సీపై ఎవరికి వారుగా కాకుండా... సంఘాలన్నీ ఉమ్మడిగా ఉద్యమించాలని పలు ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగసంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగుల నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇవ్వనున్నాయి. 


ఉద్యోగసంఘాల భేటీలో కీలక నిర్ణయాలు

ఈ నెల 23న జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు

ఈ నెల 25న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు 

ఈ నెల 26న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాల సమర్పణ

ఈ నెల 27 నుంచి 30 వరకు ఉద్యోగుల నిరాహార దీక్షలు

ఫిబ్రవరి 3న చలో విజయవాడ

ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.