వైసీపీ సమావేశంలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-28T00:39:09+05:30 IST

వైసీపీ సమావేశంలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

వైసీపీ సమావేశంలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

తాడేపల్లి: వైసీపీ సమావేశంలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా నా గ్రాఫ్‌ 65 శాతం ఉందని జగన్ తెలిపారు. ఎమ్మెల్యేల్లో చాలామందికి 40 నుంచి 45 శాతమే గ్రాఫ్‌ ఉందని, ఎన్నికల నాటికి మీ గ్రాఫ్‌ పెరగకపోతే మార్పులు తప్పవని జగన్‌ వార్నింగ్ ఇచ్చారు. మన సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. వాస్తవాలను చెప్పే మీడియాపై అక్కసు వెళ్లగక్కిన సీఎం జగన్‌, మనం పోరాటం చేస్తుంది చంద్రబాబుతో కాదు.. మీడియాతో కూడా అని సీఎం తెలిపారు. సాక్షి టీవీ, పేపర్‌ ద్వారా పార్టీకి అనుకూలంగా విస్తృత ప్రచారం చేస్తోందన్నారు.


ఎమ్మెల్యేల పనితీరు గ్రాఫ్‌ పడిపోతే సీటు ఇవ్వనని.. పక్కన పెడతా జగన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు నివేదికలు తన దగ్గర ఉన్నాయని, కొంతమంది గ్రాఫ్‌ కిందకు.. మరికొంతమంది గ్రాఫ్ పైకి ఉందన్నారు. గ్రాఫ్‌ తగ్గినవాళ్లను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తానని చెప్పారు. రెండేళ్లలో మనం ఎన్నికలకు వెళుతున్నామని, 151 సీట్లకు ఒక్క సీటు తగ్గకూడదని సీఎం జగన్ అన్నారు. మనం సంక్షేమం బాగా చేశాం.. 175 ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. మంత్రులదే కీలక బాధ్యతలు, అవసరమైతే తగ్గండి అని, జిల్లాలో అందరినీ కలుపుకు వెళ్లాల్సిన బాధ్యత మంత్రులదే అని సీఎం జగన్ వెల్లడించారు. ప్రతిపక్షం, మీడియా లేనివి ఉన్నట్టు చెబుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మీరంతా ఒక్కటే గుర్తుపెట్టుకోండి..మళ్లీ గెలిపిస్తేనే మీకు మంత్రి పదవి వస్తుందని జగన్ చెప్పారు. మే 10 నుంచి గడపగడపకు వైసీపీ కార్యక్రమం, ఇంటింటికీ వచ్చిన ప్రయోజనాల బుక్‌లెట్‌ తీసుకొని వెళ్లాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-28T00:39:09+05:30 IST