నేషనల్‌ యంగ్‌ అచీవర్‌ అవార్డుకు కేజీబీవీ విద్యార్థిని ఎంపిక

Published: Mon, 24 Jan 2022 23:29:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేషనల్‌ యంగ్‌ అచీవర్‌ అవార్డుకు కేజీబీవీ విద్యార్థిని ఎంపికమాగర్ల లావణ్య (ఫైల్‌)

తడ, జనవరి 24 : కేంద్ర ప్రభుత్వం స్థానిక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని మాగర్ల లావణ్యను నేషనల్‌ యంగ్‌ అచీవర్‌ 2022 అవార్డుకు ఎంపిక చేసింది. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు ప్రకటించింది. 2018లో జిల్లాస్థాయి ఇన్‌స్పైయిర్‌ ప్రాజెక్టులో ప్రథమస్థానం సాధించిన అనంతరం అదే సంవత్సరం రాష్ట్ర అంతరిక్ష కేంద్రానికి ఎంపికై అమెరికాలోని నాసా ప్రధాన కార్యాలయానికి వెళ్లివచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆ విద్యార్థిని ప్రతిభను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపక సిబ్బంది లావణ్యను శాలువాతో సత్కరించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.