KGF-2: అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా భారీ కలెక్షన్స్!

ABN , First Publish Date - 2022-04-14T15:43:03+05:30 IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన సినిమా 'కేజీఎఫ్ చాప్టర్-2'.

KGF-2: అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా భారీ కలెక్షన్స్!

ఓవర్సీస్ సినిమా: కన్నడ రాకింగ్ స్టార్ యశ్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన సినిమా 'కేజీఎఫ్ చాప్టర్-2'. ఇవాళ(గురువారం) ప్రపంచ వ్యాప్తంగా 10వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. అంతకుముందు సెన్సెషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కడంతో కేజీఎఫ్-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్ విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా యశ్ డైలాగ్స్ సూపర్బ్‌గా ఉండడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీపై ఏర్పడిన భారీ అంచనాలతో చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ఇటు భారత్‌తో పాటు అటు ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో విడుదల చేసింది. ఓవర్సీస్‌లో ఏకంగా 4వేలకు పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసింది. 


ముఖ్యంగా అమెరికాలో కేజీఎఫ్-2 భారీ స్థాయిలో విడుదలైంది. బుధవారమే యూఎస్‌లో ప్రీమియర్స్ పడిపోయాయి. దీంతో ప్రీమియర్స్ ద్వారానే అమెరికాలో ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా 8లక్షల డాలర్ల(రూ.6కోట్లకు పైగా) గ్రాస్‌ను రాబట్టిందని అక్కడ మూవీని విడుదల చేసిన సరిగమ సినిమాస్ ట్వీట్ చేసింది. ఇక మూవీ చూసిన ఆడియన్స్ సినిమా చాలా బాగుందని చెప్పారు. హీరో ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఓ లెవెల్‌లో ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బీజీఎం కూడా అదరిపోయిందంటున్నారు. గ్రాండ్ విజువల్స్​తో పాటు రాఖీ భాయ్​గా యశ్​- అధీరాగ సంజు బాబా​ యాక్షన్​ ఎపిసోడ్స్ వేరే లెవల్​లో ఉన్నాయని చెబుతున్నారు. హీరోకు ధీటుగా ప్రతినాయకుడి పాత్ర ఉందని, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ పూనకాలు తెప్పిస్తుందట. యశ్, ప్రశాంత్ నీల్ కాంబో మరోసారి మెస్మరైజ్ చేసిందనేది ఆడియన్స్ మాట. శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కాగా, 'కేజీఎఫ్ చాప్టర్-2' ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం.  



Updated Date - 2022-04-14T15:43:03+05:30 IST