మంత్రి అల్లోలపై అర్థం లేని ఆరోపణలు చేస్తే ఖబర్దార్‌

ABN , First Publish Date - 2022-05-29T07:14:12+05:30 IST

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అర్థం లేని ఆరోపణలు చేస్తే ఖబర్దార్‌ అంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మహేశ్వర్‌ రెడ్డిని హెచ్చరించారు.

మంత్రి అల్లోలపై అర్థం లేని ఆరోపణలు చేస్తే ఖబర్దార్‌
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

దమ్ముంటే మంత్రి కుటుంబంలో ఏ ఒక్కరైనా ఎకరం భూమి కబ్జా చేసుకున్నది నిరూపించు  

కాంగ్రెస్‌ నాయకులే అసైన్డ్‌ భూముల్లో రియల్‌ దందా చేస్తున్నారు 

ఏఐసీసీ వ్యవహార అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల ఫైర్‌

నిర్మల్‌ అర్బన్‌, మే 28 : మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అర్థం లేని ఆరోపణలు చేస్తే ఖబర్దార్‌ అంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మహేశ్వర్‌ రెడ్డిని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం నిర్మల్‌లో నిర్వహించిన విలేకరు ల సమావేశంలో టీఆర్‌ఎస్‌ నిర్మల్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నిర్మ ల్‌ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ నేరెళ్ల వేణు, హజ్‌ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నజీర్‌ఖాన్‌, ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీగారి రాజేందర్‌లు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏలేటి మహే శ్వర్‌రెడ్డి దమ్ముంటే మంత్రి కుటుంబంలో ఒక్కరైనా ఎకరం భూమి కబ్జా చేసుకున్నది నిరూపించాలని సవాల్‌ విసిరారు. ప్రస్తుతం మాటిమాటికీ రా జకీయ సన్యాసం పేరెత్తుతున్న మహేశ్వర్‌రెడ్డి ఇప్పటికీ తాను రాజకీయ స న్యాసంలోనే ఉన్నారనే విషయాన్ని మరిచి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసు కుంటానని చెప్పిన మహేశ్వర్‌రెడ్డి ఇప్పుడు రాజకీయ సన్యాసంలోనే ఉన్నార ని టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ఎప్పటికీ మహేశ్వర్‌రెడ్డి నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యేగానే ఉంటారే తప్పా ఎమ్మెల్యేగా మళ్లీ గెలువబోరని వారు జోస్యం చెప్పారు. భవిష్యత్తులోనూ మహేశ్వర్‌రెడ్డికి రాజకీయ సన్యాసం తప్పదని హెచ్చరించారు. మంత్రి కుమారుడు గౌతమ్‌రెడ్డిపై గతంలో పలు ఆరోపణ లు చేసిన మహేశ్వర్‌రెడ్డి ఏ ఒక్క ఆరోపణలు నిరూపించలేకపోయారన్నారు. రాజకీయ లబ్ధిపొందేందుకు ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మహేశ్వర్‌రెడ్డిని విమర్శించారు. ఇక రాబోయే రోజుల్లో అసైన్డ్‌భూముల్లో అక్రమ లే అవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా తెరవెనుక ఉండి మహేశ్వర్‌రెడ్డి నడిపిస్తున్నారని, తాజాగా మళ్లీ తానే అసైన్డ్‌ భూములపై పోరాటం చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. డీ వన్‌ పట్టాల విషయంలో, అసైన్డ్‌ భూముల విషయంలో మంత్రి అల్లోలపై, ఆయన కుటుంబసభ్యులపై ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే నిరూ పించి మాట్లాడాలని మహేశ్వర్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ మండిపడ్డారు. మరోసారి మంత్రిపై, ఆయన కుటుంబ సభ్యులపై ఇష్టారాజ్యంగా అవాకులు, చెవాకులు పేలితే మహేశ్వర్‌రెడ్డికి బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఈ విలే కరుల సమావేశంలో కౌన్సిలర్లు పూదరి రాజేశ్వర్‌, లక్కాకుల నరహరి, గండ్ర త్‌ రమణ, సలీం, అయ్యన్నగారి రాజేందర్‌, నల్లూరి పోశెట్టిలతో టీఆర్‌ఎస్‌ నాయకులు గండ్రత్‌ రమేష్‌, కృషిరోద్దీన్‌, పద్మాకర్‌, మతీన్‌, శ్రీధర్‌, లక్ష్మణా చారి, అడపా పోశెట్టి, పూదరి శివ, ఓడ్నం రాజేందర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T07:14:12+05:30 IST