ఖాదీ చీరల్లో...

ABN , First Publish Date - 2022-01-26T05:30:00+05:30 IST

శీతాకాలంలో వెచ్చదనాన్నీ, వేసవిలో చల్లదనాన్నీ అందించే ఏకైక వస్త్రం ఖాదీ. కాబట్టే ఖాదీకి వనితలందరూ ఫిదా అవుతూ ఉంటారు..

ఖాదీ చీరల్లో...

శీతాకాలంలో వెచ్చదనాన్నీ, వేసవిలో చల్లదనాన్నీ అందించే ఏకైక వస్త్రం ఖాదీ. కాబట్టే ఖాదీకి వనితలందరూ ఫిదా అవుతూ ఉంటారు. ఆధునిక భారతావని కొత్త ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌గా విరాజిల్లుతోంది ఖాదీ. ఖాదీతో ఎన్నో రకాల దుస్తులు తయారవుతున్నా, చీరలది ఎప్పటికీ ప్రత్యేక స్థానమే! 


భిన్నమైన ప్రత్యేకతలు

 ఖాదీ చీరలు ఉతికేకొద్దీ మృదువుగా మారతాయి. దాంతో కట్టుకు సౌకర్యంగా ఉంటాయి.

 ఖాదీ మన్నిక ఎక్కువ. ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉంటాయి.

 జార్జెట్‌, పట్టు, షిఫాన్‌... ఇలా భిన్నమైన ఫ్యాబ్రిక్‌తో ఖాదీ జత కట్టగలదు.

  స్టార్చ్‌తో ఖాదీ చీరకు కొత్త మెరుపు చేకూరుతుంది.




తీరుకు తగ్గట్టు 

ఖాదీ చీరలు ఒంటి తీరుకు తగ్గట్టు ఎంచుకోవాలి. అదెలాగంటే...

 పియర్‌ షేప్‌: నడుము దిగువ భాగం పెద్దదిగా ఉండేవారు ఖాదీ జార్జెట్‌ చీరను ఎంచుకోవాలి. ముదురు రంగుతో, చిన్న ప్రింట్లతో కూడిన ఖాదీ చీరలు ఈ కోవకు చెందిన మహిళలకు బాగుంటాయి.

 యాపిల్‌ షేప్‌: నడుము పైభాగం పెద్దదిగా ఉండే మహిళలు, ఎంబ్రాయిడరీ కలిగిన ఖాదీ సిల్క్‌ చీరలను ఎంచుకోవాలి. ఈ చీరతో పొడవాటి స్లీవ్స్‌ కలిగి ఉండే బ్లౌజ్‌ ధరించాలి. 

 ప్లంప్‌ షేప్‌: భారీ శరీర తీరున్న మహిళలు ఖాదీ జార్జెట్‌ చీరలను ధరించాలి. ఈ రకం ముదురు రంగు చీరల్లో నాజూకుగా కనిపించే అవకాశం ఉంటుంది. లాంగ్‌ స్లీవ్‌ లేదా ఫుల్‌ స్లీవ్‌ బ్లౌజులు ధరించాలి.

  ఓవర్‌ వెయిట్‌: సిల్క్‌, షిఫాన్‌ ఖాదీ చీరలు ధరించాలి. 

 షార్ట్‌ అండ్‌ స్లిమ్‌: ఖాదీ జార్జెట్‌, షిఫాన్‌ చీరలు వీరికి బాగుంటాయి. పెద్ద బార్డర్లు, పెద్ర ప్రింట్లు కలిగి ఉండే చీరలను ధరించకూడదు.

Updated Date - 2022-01-26T05:30:00+05:30 IST