Breaking News: ఖైరతాబాద్ గణేశుడి దర్శనం తాత్కాలికంగా నిలిపివేత

ABN , First Publish Date - 2022-09-08T00:08:05+05:30 IST

ఖైరతాబాద్ గణేశ్ దర్శనాన్ని ఉత్సవ కమిటీ తాత్కాలికంగా నిలిపివేసింది. నగరంలో కురుస్తున్న వర్షాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ధ్యాహ్నం నుంచి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. అటు....

Breaking News: ఖైరతాబాద్ గణేశుడి దర్శనం తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశ్ ( Khairatabad Ganesh) దర్శనాన్ని ఉత్సవ కమిటీ తాత్కాలికంగా నిలిపివేసింది. నగరంలో కురుస్తున్న వర్షాలతో కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. అటు ఖైరతాబాద్ పరిసరాల్లో కూడా వాన పడింది. దీంతో ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షం పడుతుండటంతో గణేశుడి దర్శనాన్ని నిలిపివేశారు. 


వినాయక చవితి నేపథ్యంలో నగర వాసులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో భక్తుల కోసం గణేశుడి ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో భక్తులు భారీగా తరలివెళ్లి గణేశుడికి పూజలు చేస్తున్నారు.


అయితే ఒక్కసారిగా కురిసిన వర్షంతో స్వామివారి దర్శనాలకు అంతరాయం కలిగింది. దీంతో గణేశుడి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షం తగ్గిన తర్వాత యధావిధిగా స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతించే అవకాశం ఉంది. 


Updated Date - 2022-09-08T00:08:05+05:30 IST