Heavy security: ఖైరతాబాద్ గణేష్ వద్ద భారీ భద్రత

ABN , First Publish Date - 2022-08-31T14:29:05+05:30 IST

ఖైరతాబాద్‌లో మహా గణపతి కొలువుదీరిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Heavy security:  ఖైరతాబాద్ గణేష్ వద్ద భారీ భద్రత

హైదరాబాద్:  ఖైరతాబాద్‌లో మహా గణపతి (Khairataba maha ganapati) కొలువుదీరిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.  గణేష్ మండపం ఎదురుగా ఉన్న ప్రదాన నాలుగు రహదారులు నిఘా నీడలోకి వెళ్లాయి. 9 ప్రధాన మెటల్ డిటెక్టర్స్‌తో క్షుణ్ణంగా తనిఖీ తరువాతే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఈ సారి భారీ భద్రత సెక్యూరిటి వింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. మూడు షిఫ్ట్‌లో 360 పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. క్రైమ్‌ టీమ్స్‌, షీటీమ్స్‌, సిటీ కమాండోస్, క్విక్ రియాక్షన్ టీంమ్స్, ఐడీ పార్టీలు, టీఎస్ పోలీస్ బెటాలియన్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలతో పాటు షాడో టీంమ్స్  రంగంలోకి దిగాయి. 70 అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని వెల్ నెస్ సెంటర్ హాస్పిటల్‌లో సెంట్రల్ జోన్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసందానం చేశారు. 


మరోవైపు... ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారిపోయాయి. మహాగణపతిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూకట్టారు. మరి కాసేపట్లో భారీ గణనాధుడికి తొలి పూజ జరుగనుంది. పంచముఖ లక్ష్మీ మహాగణపతిని దర్శించుకోవడానికి  భక్తులు క్యూ కడుతున్నారు. 

Updated Date - 2022-08-31T14:29:05+05:30 IST