Khairatabad Mahaganapati: చవితి వేడుకలకు సిద్ధమైన ఖైరతాబాద్ మహాగణపతి

ABN , First Publish Date - 2022-08-30T20:14:45+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ మహాగణపతి వినాయక చవితి వేడుకలకు సిద్ధమయ్యాడు.

Khairatabad Mahaganapati: చవితి వేడుకలకు సిద్ధమైన ఖైరతాబాద్ మహాగణపతి

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ మహాగణపతి (Khairatabad mahaganapati) వినాయక చవితి వేడుకల (Vinayaka Chavithi celebrations)కు సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ బడా గణేషున్ని చూసేందుకు భక్తులు బార్లు తీరుతున్నారు.  ఖైరతాబాద్ గణేషుడు (Maha ganesh) మొదటి సారి మట్టితో తయ్యారయ్యాడు. 150 కళాకారులు జూన్ 10 నుంచి పగలు రాత్రి పని చేస్తూ మహాగణపతిని సిద్ధం చేశారు. ఈ ఏడాది మహాగణపయ్య 50 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఏడాది శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపంలో భక్తులకు కనువిందు చేయనున్నాడు. ఖైరతాబాద్ గణేషుడికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువు దీరుతున్నారు. ప్రభుత్వ సూచనలతో ఖైరతాబాద్‌లో మొట్ట మొదటి సారి మట్టి విగ్రహాన్ని(clay idol) తయారు చేశారు. హుస్సేన్ సాగర్‌ (HussainSagar)లోనే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం (Immersion of Ganesh) జరుగనుంది. ఖైరతాబాద్ గణేష్ తయారీకి కోటి 50 లక్షల రూపాయల వ్యయం అయ్యింది. 

Updated Date - 2022-08-30T20:14:45+05:30 IST