Revanth Reddy: ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుని ఏమన్నారంటే...!

ABN , First Publish Date - 2022-09-06T04:34:30+05:30 IST

మహాగణపతి ఉత్సవాలు అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ....

Revanth Reddy: ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుని ఏమన్నారంటే...!

హైదరాబాద్ (Hyderabad): మహాగణపతి (Maha Ganapati) ఉత్సవాలు అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ (Khairatabad) మహాగణపతి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) అన్నారు. ఖైరతాబాద్ గణేషుడిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో సర్వమతాల సమైక్యతను చాటడానికి గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. మతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు.  ప్రపంచానికే ఆదర్షంగా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.  ఈ గణపతి ఆశీర్వాదంతో రాష్ట్రంలో వర్షాలు కురవాలని.. మతసామరస్యం వర్ధిల్లాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారు.  హైదరాబాద్ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దేదుకు ఆనాటి నుంచి కాంగ్రెస్ (Congress) ఎంతో కృషి చేసిందన్నారు. భవిష్యత్‌లో నగరానికి పెట్టుబడులు తీసుకువచ్చి.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. 



Updated Date - 2022-09-06T04:34:30+05:30 IST