
ఖమ్మం: జిల్లా కేంద్రంలో ఓ ద్విచక్రవాహనం బట్టల దుకాణంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఆ దుకాణంలో ఉన్నవారు ఈ ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారు. బైక్ దూసుకొచ్చిన సమయంలో షాపులో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. బైక్ రావడాన్ని గమనించి వెంటనే పక్కకు వెళ్లడంతో వారు క్షేమంగా బయటపడ్డారు. ఇక బైక్ నడుపుతున్న యువకుడు కూడా క్షేమంగా ఉన్నాడు. పోలీసులు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఈ ఘటన జరిగినట్లు వాహనదారుడు తెలిపాడు. ఖమ్మంలోని రావిచెట్టు బజార్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.