ఖమ్మం జిల్లా: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక రెండు రోజులు సోమ, మంగళవారం ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఖమ్మం బస్ డిపో ముందు వామపక్ష పార్టీల నాయకులు బైఠాయించి ధర్నా చేపట్టారు. అలాగే కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి