ఖేల్‌ రత్నకు నీరజ్ చోప్రా, మిథాలీ సహా 11 మంది ఎంపిక

ABN , First Publish Date - 2021-10-28T01:49:11+05:30 IST

ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా, ఇండియన్ వుమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీరాజ్, ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రీ సహా మొత్తం 11 మంది క్రీడాకారులకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు..

ఖేల్‌ రత్నకు నీరజ్ చోప్రా, మిథాలీ సహా 11 మంది ఎంపిక

న్యూఢిల్లీ: ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా, ఇండియన్ వుమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీరాజ్, ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రీ సహా మొత్తం 11 మంది క్రీడాకారులకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా, క్రికెటర్ శిఖర్ ధావన్‌ సహా మరో 34 మంది క్రీడాకారులకు అర్జున అవార్డును ప్రకటించారు. జాతీయ క్రీడా అవార్డుల కమిటీ బుధవారం ఈ ప్రకటన చేసింది. వాస్తవానికి ఈ అవార్డులు ముందే ప్రకటించాలి. కానీ, జూలై-ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరు కావాల్సి ఉండడంతో వాయిదా వేశారు.


ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైనవారు

నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్)

రవి దహియా (రెజ్లింగ్)

పీఆర్ శ్రీజేష్ (హాకీ)

లోవ్లీనా బోర్గోహెయిన్ (బాక్సింగ్)

సునీల్ ఛెత్రీ (ఫుట్‌బాల్)

మిథాలీ రాజ్ (క్రికెట్)

ప్రమోద్ భగత్ (బాడ్మింటన్)

సుమిత్ అంతిల్ (అథ్లెటిక్స్)

అవని లేఖర (షూటింగ్)

క్రిష్ణ నగర్ (బ్యాడ్మింటన్)

మనిష్ నర్వాల్ (షూటింగ్)


అర్జున అవార్డుకు ఎంపికైనవారు

యోగేష్ కథూరియా (డిస్కస్ త్రో)

నిషద్ కుమార్ (హై జంప్)

ప్రవీణ్ కుమార్ (హై జంప్)

శరద్ కుమార్ (హై జంప్)

సుహాస్ ఎల్‌వై (బ్యాడ్మింటన్)

సింఘరాజ్ అధానా (షూటింగ్)

భవిన పటేల్ (టేబుల్ టెన్నిస్)

హర్విందర్ సింగ్ (ఆర్చరీ)

శిఖర్ ధావన్ (క్రికెట్)

Updated Date - 2021-10-28T01:49:11+05:30 IST