Advertisement

సిద్ధార్థ్‌కు కియార విషెస్!

Jan 17 2021 @ 13:58PM

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా ఆడ్వాణీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ వ్యవహారం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ఎప్పట్నుంచో డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. ఇటీవల ఈ జంట నూతన సంవత్సర వేడుకల కోసం మాల్దీవులకు వెళ్లింది. ముంబై విమానాశ్రయానికి ఇద్దరూ ఒకే కారులో వచ్చి కెమేరాలకు చిక్కారు.  


దీంతో వీరి ప్రేమ గురించి మరోసారి జాతీయ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఆ వార్తలపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు. ఈ రోజు (ఆదివారం) సిద్ధార్థ్ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా కియార ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సిద్ధార్థ్‌కు విషెస్ చెప్పింది. సముద్రంపై షికారు చేస్తున్న సిద్ధార్థ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. 

 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.