
చిన్ననాటి రోజులు ఎవరికైనా మరుపురాని జ్ఞాపకాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నతనంలో వచ్చీరాని మాటలు, తప్పటడుగులు, తెలిసీతెలియక చేసే పనులన్నీ.. పెద్దయ్యాక గుర్తు చేసుకుంటే నవ్వు వస్తూ ఉంటుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం కాబట్టి.. రోజు వారీ చిన్న చిన్న పనులను కూడా వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ చిన్నారి తెలిసీ తెలియక చేసిన పని.. నెటిజన్లు విపరీతంగా నవ్వు తెప్పిస్తోంది.
ట్విట్టర్లో వైరల్ అవుతున్న వీడియోలో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ పెద్దవారితో పాటూ ఓ చిన్నారి ఆడుకుంటూ ఉంటుంది. కొందరు మహిళలు కూర్చుని ఉండగా.. ఓ మహిళ నిలబడుకుని ఉంటుంది. అక్కడే ఓ ఖాళీ కుర్చీ ఉండడంతో, నిలబడి ఉన్న మహిళ.. ఆ కుర్చీని తీసుకుని కూర్చునేందుకు ప్రయత్నిస్తుంది. సరిగ్గా అప్పుడే చిన్నారి.. ఆ కుర్చీని పక్కకు జరుపుతుంది. ఇది గమనించని మహిళ సడన్గా కూర్చుంటుంది. ఇంకేముందీ! దబేల్మని కిందపడుతుంది. దీంతో పక్కనున్న వారంతా షాక్ అవుతారు. తర్వాత విషయం తెలుసుకుని అంతా పకపకా నవ్వుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి