Kidnapping: 15ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఆమె బావ

ABN , First Publish Date - 2022-07-31T15:18:10+05:30 IST

15సంవత్సరాల బాలికను ఆమె బావ మధు కిడ్నాప్ (Kidnap) చేశాడు.

Kidnapping: 15ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఆమె బావ

వరంగల్ (Warangal): 15సంవత్సరాల బాలికను ఆమె బావ మధు కిడ్నాప్ (Kidnap) చేశాడు. ఇరవై రోజుల క్రితం బాలిక అక్క భర్త మధు ఆమెను స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలిక కాజీపేటలోని స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. దీంతో తల్లిదండ్రులు కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో.. బాలిక తల్లి కరుణ మానవహక్కుల వేదికను ఆశ్రయించారు. కిడ్నాప్‌పై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-07-31T15:18:10+05:30 IST