kidney racket గుట్టు రట్టు.. డాక్టర్లు సహ 10 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-03T17:24:48+05:30 IST

గూడులేని నిరుపేదలను టార్గెట్‌గా డబ్బుల ఆశ చూపిస్తూ ఈ రాకెట్‌ను నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సోనిపట్‌లో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసిన అక్కడే పేషెంట్లకు కిడ్నీ ఆపరేషన్లు నిర్వహించేవారని తెలిపారు. ఆపరేషన్ కోసం పేషెంట్ నుంచి లక్షల్లో ఫీజు వసూలు చేసేవాడినని పట్టుబడిన వైద్యుడు..

kidney racket గుట్టు రట్టు.. డాక్టర్లు సహ 10 మంది అరెస్ట్

న్యూఢిల్లీ: కొవిడ్ కారణంగా తండ్రి ఉద్యోగం పోయింది. ఆసుపత్రికి డబ్బులు కట్టలేక చికిత్స మధ్యలోనే తల్లిని డిశ్చార్జీ చేయాల్సి వచ్చింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఇక తప్పదని గుజరాత్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు రఘు(21) అనే వ్యక్తి. అక్కడా ఉపాధి కరువే అయింది. నిలువ నీడ లేకుండా పోయింది. దక్షిణ ఢిల్లీలోని ఒక గురుద్వార బయట ఉంటున్నాడు. ఇలా ఉంటుండగా ఒక రోజు ఒక వ్యక్తి వచ్చి కిడ్నీ ఇస్తావా, మూడు లక్షల రూపాయలు ఇస్తానని అడిగాడట. మొదట దానికి ఒప్పుకోలేదు కానీ, కుటుంబ పరిస్థితి చూసి ఒప్పుకోక తప్పలేదు. రఘుతో పాటు మరో 15 మంది ఇదే మోసానికి బలై తమ కిడ్నీలు అమ్ముకున్నారు. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఈ రాకెట్‌ను బుధవారం పోలీసులు రట్టు చేశారు. ఇందులో భాగమైన 10 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు.


గూడులేని నిరుపేదలను టార్గెట్‌గా డబ్బుల ఆశ చూపిస్తూ ఈ రాకెట్‌ను నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సోనిపట్‌లో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసిన అక్కడే పేషెంట్లకు కిడ్నీ ఆపరేషన్లు నిర్వహించేవారని తెలిపారు. ఆపరేషన్ కోసం పేషెంట్ నుంచి లక్షల్లో ఫీజు వసూలు చేసేవాడినని పట్టుబడిన వైద్యుడు విచారణలో వెల్లడించారు. ఆరు నెలల్లో సుమారు 14 మందికి ఆపరేషన్లు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పాడు. విచారణ ఇంకా కొనసాగుతోందని, ఇది ముగిసేనాటికి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితులకు సైతం ముందుగా ఒప్పుకున్న డబ్బు ఇవ్వకుండా మరింత మోసం చేశారట. లక్ష నుంచి మూడు లక్షల రూపాయల మధ్యే చెల్లించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-06-03T17:24:48+05:30 IST