ఈ పాప ఇలాంటి రియాక్షన్ ఎందుకిచ్చిందంటే...

ABN , First Publish Date - 2022-06-21T17:03:54+05:30 IST

హ్యాపీ బర్త్‌డే పాట పాడుతూ చిన్నారులకు బర్త్ డే...

ఈ పాప ఇలాంటి రియాక్షన్ ఎందుకిచ్చిందంటే...

హ్యాపీ బర్త్‌డే పాట పాడుతూ చిన్నారులకు బర్త్ డే సెలబ్రేషన్ చేసినప్పుడు వారు నవ్వుతుంటారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఒక చిన్నారి బర్త్ డే పాటకు విచిత్రంగా స్పందించింది. ఇది చాలామందికి నవ్వు తెప్పించింది. ఈ వీడియోను ఆ చిన్నారి తల్లి మరియం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో పోస్ట్ చేసింది. దాని కింద ఈ పాట అమెను ‘‘ఇంప్రెస్ చేయలేకపోయింది’’ అని రాసింది.  ఆ చిన్నారి కోసం ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తల్లి ఈ వీడియోను పోస్ట్ చేసింది. 




ఆ వీడియోలో ఒక చిన్నారి ఎత్తయిన కుర్చీలో కూర్చుని తన గడ్డం కింద తన చేతిని ఉంచుకుని కనిపిస్తుంది. ఆమె చుట్టూవున్నవారు "హ్యాపీ బర్త్‌డే" పాట పాడారు. ఈ పాట ఆమెకు నచ్చలేదు. దీంతో ఆ చిన్నారి తన ముఖాన్ని విచిత్రంగా పెట్టింది. దీనికి తల్లి స్పందిస్తూ  "నా కుమార్తెను ఈ 'హ్యాపీ బర్త్‌డే' పాట ఆకట్టుకోలేదు," అనే కామెంట్ రాసింది. ఈ వీడియో క్లిప్ 8.7 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ఆ చిన్నారి(అమీరా) పుట్టినరోజున ఒక గాయనిని తీసుకువస్తే బాగుండేదని సూచించాడు. 


Updated Date - 2022-06-21T17:03:54+05:30 IST