రాజు బలవంతుడైనప్పుడు శత్రువులు ఒక్కటౌతారు!

ABN , First Publish Date - 2022-06-30T07:12:39+05:30 IST

రాజు బలవంతుడైనప్పుడు శత్రువులంతా ఒకటై రాజును ఓడించాలని చూస్తారని, అలాగే తమ నాయకుడు జగన్‌ను ఓడించడానికి శత్రువులంతా ఒకటయ్యారని, కానీ ప్రజాబలం ఉన్న తమ నేతను ఓడించలేరని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.

రాజు బలవంతుడైనప్పుడు శత్రువులు ఒక్కటౌతారు!
వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతున్న హోంమంత్రి తానేటి వనిత

రాజమహేంద్రవరం వైసీపీ ప్లీనరీలో  హోంమంత్రి తానేటి వనిత 

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 29: రాజు బలవంతుడైనప్పుడు శత్రువులంతా ఒకటై రాజును ఓడించాలని చూస్తారని, అలాగే తమ నాయకుడు జగన్‌ను ఓడించడానికి శత్రువులంతా ఒకటయ్యారని, కానీ ప్రజాబలం ఉన్న తమ నేతను ఓడించలేరని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం రాజమహేంద్రవరం ఆనంద్‌ రీజెన్సీలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అధ్యక్షతన జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశానికి మంత్రి వనిత, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, వైసీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, పార్టీ పరిశీలకులు బాబ్జి, వంకా రవీంద్ర, గాండ్ల తెలకుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సంకిస భవాని ప్రియ, హితకారిణి సమాజం ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ మునికుమారి, ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ గిరిజాల రామతులసీలు హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడు తూ గత 12 ఏళ్లుగా జెండా పట్టుకుని ఒక కమిట్‌మెంట్‌తో కార్యకర్తలు పనిచేశారన్నారు. జగనన్న ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని చెప్పారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయ్యిందని, ఈ మూడేళ్లలో జరిగిన ఎన్ని కల్లో వైసీపీ విజయం సాధించిందంటే దానికి కారణం జగనన్న తీసుకున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న పథకాలేనన్నారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ తమ నాయకుడు జగన్‌ ప్రజామోదం పొందిన మేనిఫెస్టోనే అమలు చేస్తున్నారన్నారు. ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగర సమగ్ర అభి వృద్ధికి సీఎం జగన్‌తో మాట్లాడి రూ.125 కోట్ల ప్రత్యేక గ్రాంటును తీసుకువచ్చానన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ సమష్టిగా విజ యాన్ని సాధించాలన్నారు. అబ్జర్వర్లు బాబ్జి, వంకా రవీంద్ర, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడారు. చివరిగా నగర అభివృద్ధికి సంబంధించి ఆరు తీర్మానాలను సభలో ప్రవేశ పెట్టారు. తీర్మానాలను ఎంపీ భరత్‌రామ్‌ వైసీపీ నాయకులు నం దెపు శ్రీను, టికే విశ్వేశ్వరరెడ్డి, పాలిక శ్రీను, గిరిజాల రామతులసీ, పోలు విజయలక్ష్మిలతో ప్రవేశపెట్టించగా సభ ఆమోదించింది.



Updated Date - 2022-06-30T07:12:39+05:30 IST