కొల్లేరులో కిక్కిస మంటలు

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

కొల్లేరులోని కిక్కిస తగులబెట్టడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

కొల్లేరులో కిక్కిస మంటలు
కొల్లేరులో కిక్కిస తగులబెట్టడంతో ఆవరించిన పొగ

ఆకివీడు రూరల్‌, మే 22: కొల్లేరులోని కిక్కిస తగులబెట్టడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కొల్లేరులో విపరీతంగా పెరిగిపోతున్న కిక్కిసను వేస విలో తగులబెడతారు. ఈ ప్రభావంతో చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనితో పెదాలు పొడిబారడం, గొంతు తడారిపోవడం జరుగు తుంది. రాత్రి పూట కూడా వేడి ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తగులబడిని కిక్కిస నుంచి మసి రేణువులు గాలికి చుట్టు ప్రక్కల ప్రాంతాలలో వచ్చి పడుతున్నాయి. కొల్లేరు అభయారణ్యంలో పక్షి గూళ్లు కూడా కాలిపోయాయి. అటవీశాఖాధికారులు మాత్రం వీటిని ఏమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొల్లేరు సరస్సును రక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంతో ప్రకృతికి పెను ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST