Amalapuramలో కిలాడీ లేడీ దొంగ అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-24T20:14:49+05:30 IST

అమలాపురంలో కిలాడీ లేడీ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.

Amalapuramలో కిలాడీ లేడీ దొంగ అరెస్ట్

కోనసీమ: అమలాపురంలో కిలాడీ లేడీ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 16న భీమనపల్లి నుండి అమలాపురం వస్తు ఉండగా ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగ్‌ను కిలాడి లేడీ దొంగిలించింది. అమలాపురం పట్టణ పోలీస్టేషన్‌లో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. మహిళా దొంగ నుండి రూ.7.5 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు  పట్టణ సీఐ కొండలరావు తెలిపారు. తిరుపతికి చెందిన కోయ లక్ష్మీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెల్లడించారు. 

Updated Date - 2022-06-24T20:14:49+05:30 IST