రామ్‌కుమార్‌రెడ్డితో కిలివేటి భేటీ

Published: Tue, 25 Jan 2022 21:18:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 రామ్‌కుమార్‌రెడ్డితో కిలివేటి భేటీరామ్‌కుమార్‌రెడ్డిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

వాకాడు, జనవరి 25 :  ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని మంగళ వారం ఆయన నివాసంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కలిశారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీలో కొత్తగా ఏర్పడే జిల్లాలు, అందులో ప్రధానంగా బాలాజీజిల్లా ఏర్పాటుపై చర్చలు జరిపామ న్నారు. రైతుల కోసం స్వర్ణముఖి బ్యారేజీపై 2.5 అడుగుల  గేట్లు ఎత్తుపెంచి, ప్రతి ఏటా బ్యారేజీకి 3 టీఎంసీల గంగజలాలు శాశ్వతహక్కుగా వచ్చేటట్లు సీఎం దృష్టికి తీసుకుపోయామన్నారు. త్వరలో నిఽధులు మంజూరై పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  వైసీపీ నాయకులు కొడవలూరు భక్తవత్సల్‌రెడ్డి, దువ్వూరు భాస్కర్‌రెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దేవారెడ్డి నాగూర్‌రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.