flyover: ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం

ABN , First Publish Date - 2022-09-10T18:29:05+05:30 IST

ఫ్లైఓవర్‌పై(flyover) శుక్రవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు బైకర్లు మరణించగా....

flyover: ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం

వేగంగా వచ్చిన కారు బైక్ రైడర్స్‌కు ఢీ...నలుగురి మృతి, మరో నలుగురికి గాయాలు

నాగపూర్ (మహారాష్ట్ర):ఫ్లైఓవర్‌పై(flyover) శుక్రవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు బైకర్లు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో జరిగింది. నాగపూర్ నగరంలోని సక్కరదర ఫ్లై ఓవరుపై(Nagpur flyover) వేగంగా వచ్చిన కారు(car hit) రెండు ద్విచక్రవాహన చోదకులను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు బైకర్లు 80 అడుగుల ఎత్తున్న వంతెనపై నుంచి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో వారు అక్కడికి అక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.డ్రైవరు వేగంగా కారు నడుపుతూ(speeding car) అదుపుతప్పి బైక్ లను ఢీకొట్టాడని నాగపూర్ పోలీసులు చెప్పారు. 


Updated Date - 2022-09-10T18:29:05+05:30 IST