మొదటిసారి mask ధరించిన Kim Jong Un

ABN , First Publish Date - 2022-05-13T19:47:52+05:30 IST

North Korea అధ్యక్షుడు మొట్టమొదటిసారి mask ధరించారు. ఆ దేశంలో గురువారం తొలి కొవిడ్ కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే కిమ్.. మాస్క్‌తో కనిపించడం విశేషం. కాగా, గడిచిన రెండేళ్లలో ప్రపంచమంతా కొవిడ్ గుప్పిట్లో..

మొదటిసారి mask ధరించిన Kim Jong Un

ప్యాంగ్యాంగ్: North Korea అధ్యక్షుడు మొట్టమొదటిసారి mask ధరించారు. ఆ దేశంలో గురువారం తొలి కొవిడ్ కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే కిమ్.. మాస్క్‌తో కనిపించడం విశేషం. కాగా, గడిచిన రెండేళ్లలో ప్రపంచమంతా కొవిడ్ గుప్పిట్లో అతలాకుతమవుతుంటే.. తమ దేశంలో మాత్రం ఒక్క కొవిడ్ కేసు నమోదు కాలేదంటూ ఇన్ని రోజులు ఉత్తర కొరియా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కాగా, కొవిడ్ తొలి కేసు నమోదు అయిన అనంతరం దేశంలోని ప్రభుత్వా నేతలు, అధికారులతో కిమ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన మాస్క్ ధరించి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇక మొదటి కొవిడ్ కేసు అనంతరం ఉత్తర కొరియాలోని పలు నగరాలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారట. వైరస్ వ్యాప్తి చెందకుండా కార్యాలయాల మధ్య అనుసంధానాన్ని మూసేశారు. దేశంలో చాలా మందికి టీకాలు వేయలేదు. దీంతో కొవిడ్ వ్యాప్తిపై అనేక భయాలు ఉన్నాయి. దీనిని గమనించిన కిమ్ ప్రభుత్వం.. ముందస్తు చర్యలు దిగినట్లు తెలుస్తోంది. అందుకే మొదటి కేసు నుంచే హడావుడి ప్రారంభించింది. రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జ్వరాలతో బాధపడుతున్న వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా అందులో ఒకరికి ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు కొరియన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

Read more