Advertisement

‘వైల్డ్ డాగ్‌’ టైటిల్ నచ్చలేదు

Mar 2 2021 @ 17:32PM

ఎప్పుడూ నాగార్జున అనగానే రొమాంటిక్ టైటిల్స్ మాత్రమే గుర్తొస్తాయి. జమానా నుంచి అదే రివాజు. ఇప్పుడు కొత్తగా 'వైల్డ్ డాగ్' అనగానే చాలా మందికి ముఖ్యంగా నాగార్జున అభిమానులే జీర్ణించుకోలేకపోయారు. ఇదేంట్రా బాబు అని విపరీతమైన ఆందోళనలో పడ్డారు. అవును మరి.. దశాబ్దాలుగా పెంచుకున్న అభిమానం.. ఆ మాత్రం భయం సహజమే. కానీ మరి నాగ్ ఎందుకు ఒప్పుకున్నట్టు? దర్శక నిర్మాతలు ఏం చెప్పి కింగ్‌ నాగ్‌ని ఒప్పించి ఉంటారు? ఇదే ప్రశ్నకి నాగ్ సమాధానమిచ్చారు. తనకీ ఈ టైటిల్ పెట్టగానే ముందు అదోలా అనిపించిందట. నచ్చలేదట. అయితే నాగ్ అంత హార్స్‌గా ఎక్స్‌ప్రెస్‌ చేసే నైజం ఉన్న హీరో కాదు కాబట్టి.. సున్నితంగా తిరస్కరించబోయాడట.

 

అప్పుడు దర్శక నిర్మాతలు మొత్తం చెప్పుకొచ్చారట. వాళ్ళు చెప్పిన తర్వాత తను కన్విన్స్ అయ్యానని నాగ్ మీడియా ముందు సంజాయిషీ ఇచ్చాడు. అసలు దీనికి ఆపరేషన్ వైల్డ్ డాగ్ అని పెడితే బావుండేది, ఎందుకంటే స్నిఫ్ఫర్ డాగ్స్ ఏం చేస్తాయి.. హంతకులను వాసన ద్వారా పసిగడతాయి. వెంటాడుతాయి. వేటాడుతాయి. అలాగే ఈ సినిమాలో మా టీమ్‌ క్రిమినల్స్‌ని ఛేజ్ చేసిచేసి మరీ క్యాచ్ చేస్తాయి అని నాగ్ వివరించారు. ఈ కథకి, మా పాత్రలకి పరఫెక్టుగా వైల్డ్‌ డాగ్‌ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుందని నాగ్‌ చాలా గట్టిగా వాదించి మరీ విశ్లేషించాడు.

ఏ కథని ఒప్పుకున్నా ఏదో పాయింట్ డిఫరెంట్‌గా ఉంటేనే గానీ నాగార్జున ఆ సినిమాని ఓ పట్టాన పట్టించుకోడన్నది అందరికీ సుపరిచితమైన విషయం. మరీ వైల్డ్డ్‌ డాగ్‌లో నాగార్జున దృష్టిని అంతగా ఆకర్షించిన అంశం ఏమిటి? అంటే నాగార్జునకి మొట్టమొదట ఈ కథ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఎప్పుడూ లవ్, రొమాన్స్, ఫామిలీ డ్రామాలే తప్ప హీరోలకి డిఫరెంట్ కథలు చేసే అవకాశం తరచూ రాదు. అయితే నాగార్జున వరకూ తీసుకుంటే తొంభై శాతం అన్నీ డిఫరెంట్‌గా ఉన్నట్టే చూసుకుంటాడు. కానీ అప్పడప్పుడే మన్మథుడు 2 వంటి సినిమాలకు దొరికిపోతుంటాడు. 

అయితే 'వైల్డ్‌ డాగ్‌' విషయానికొస్తే.. లుంబినీ పార్క్, కోఠీ, గోకుల్ ఛాట్ వంటి ప్రదేశాలలో జరిగిన జంట పేలుళ్ళ బ్యాక్‌ డ్రాప్‌ ఒకటీ, రెండు హైదరాబాద్‌లో జరగడం, దానివల్ల ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ నగరం భయభ్రాంతులకు గురికావడం వంటి అంశాలు తన మనసుపైన చాలా గాఢమైన ప్రభావం చూపెట్టాయని, అవే కథాంశం కావడం, అటువంటి దారుణమైన వాతావరణానికి కారణమైన వారిని పట్టుకునే బాధ్యత ఈ కథలో ఉండడమే చాలా ఎట్రాక్టివ్ పాయింట్ అని నాగార్జున చెబుతుంటే చాలా కమిట్‌మెంట్‌ కనిపించింది నాగ్‌లో. అందుకే 'వైల్డ్‌ డాగ్‌' విషయంలో మాత్రం నాగార్జున చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. ఇది హిట్‌ కొట్టాడంటే మాత్రం నాగార్జునకి 2021 సంవత్సరం మంచి గిఫ్ట్‌ ఇచ్చినట్టే. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.