రాజు కొడుకు!

ABN , First Publish Date - 2022-08-07T05:30:00+05:30 IST

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యం ఏలే రాజుకి ఒక్కగానొక్క కొడుకు. రాజు పాలన చేయకుండా తన తమ్ముడికి బాధ్యత అప్పజెప్పాడు. రాజు తమ్ముడు బలమైన శక్తిగా మారాడు.

రాజు కొడుకు!

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యం ఏలే రాజుకి ఒక్కగానొక్క కొడుకు. రాజు పాలన చేయకుండా తన తమ్ముడికి బాధ్యత అప్పజెప్పాడు. రాజు తమ్ముడు బలమైన శక్తిగా మారాడు. ఒక రోజు తన అన్న,వదినలే చంపేశాడు. రాజు కొడుకుని కూడా వదలొద్దని సైనికులకు ఆదేశించాడు. అయితే ఆలోపే రాజ్యంలోని ఓ చెలికత్తె ఆ అబ్బాయిని దూరంలోని ఓ గ్రామానికి తీసుకెళ్లి విడిచిపెట్టింది. రాజుకొడుకు ఆ పల్లెలోనుంచి అడవిలోకి వెళ్లాడు. అడవిలోని ఆకులు, పండ్లు తింటూ పెరిగాడు. పక్షులు, కోతి, కుందేలు, జింక, ఏనుగు.. లాంటి అడవి జంతువులను మచ్చిక చేసుకున్నాడు.


పులితో పోట్లాడే ధైర్యవంతుడయ్యాడు. ఆ తర్వాత పులులు సైతం భయపడేంత స్థాయికి ఎదిగాడు. ఒక రోజు అడవిలో వెళ్తుంటే ఓ వ్యక్తి ‘కాపాడండి’ అంటూ పరిగెత్తుకొస్తున్నాడు. ‘ఏమైంది’ అనడిగాడు అడవిలోని యువకుడు. ‘గుర్రంమీద వేటకి వచ్చాను. ఈ దేశానికి నేనే రాజు. పొదల చాటున నుంచి దుమికిన ఈ పులి దాడికి గుర్రం మీద నుంచి కిందపడ్డా’ అన్నాడు. అడవిలోని యువకుడి మీదకు పులి వచ్చింది. ఆ పులిమీద పిడిగుద్దులు కురిపించాడు. దీంతో బెదిరిపోయి వెనక్కి వెళ్లిపోయింది పులి. ఆ వ్యక్తి తన చిన్నాన్నే అని ఆ యువకుడికి తెలుసు. అయితే ఈ అడవి యువకుడు తన అన్నకొడుకే అనే విషయం రాజుకి తెలీదు. ఆ యువకుడిని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. సైన్యాధిపతిని చేశాడు. అతి తొందరగా తన ధైర్యం, తెగువతో తమ రాజ్యం మీదకు దండెత్తిన రాజులను వణికించాడు. మంత్రి అయ్యాడు. ఒక రోజు సభలో రాజు మాట్లాడుతున్నాడు. సైనికులొచ్చి రాజును బంధించారు. రాజుకు అర్థం కాలేదు. ‘మా చిన్నాన్నను అడవిలోకి సాగనంపండి. అక్కడ ఓ చోటు చెబుతా. అక్కడ నాలుగైదు పులులుంటాయి. వాటికి ఆహారంగా వేయండి అన్నాడు. ‘ఇది అన్యాయం’ అన్నాడు రాజు. సైనికులారా.. ఇలాంటి మాటలు వినటం ఇష్టం లేదు. పులి భుజించాక.. ఆ విషయాన్ని ముందుచెప్పిన వారికి ఆరు వజ్రాలు కానుకగా ఇస్తానన్నాడు. ఆ రోజునుంచి రాజు కొడుకు ఆ రాజ్యాన్ని అద్భుతంగా పాలించాడు. 

Updated Date - 2022-08-07T05:30:00+05:30 IST