వెటర్నరీ వర్సిటీలో కిసాన్‌ కాల్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2021-11-28T07:11:11+05:30 IST

తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో వ్యవసాయ అనుబంధ పాడి, పశు పోషణలో సందేహాల నివృత్తికోసం గతంలో ఏర్పాటుచేసిన కిసాన్‌ కాల్‌ సెంటర్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చారు.

వెటర్నరీ వర్సిటీలో కిసాన్‌ కాల్‌ సెంటర్‌

టోల్‌ ఫ్రీ నెంబరు 18001204209కు రైతులు ఫోన్‌ చేయొచ్చు


తిరుపతి(విద్య), నవంబరు 27: తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో వ్యవసాయ అనుబంధ పాడి, పశు పోషణలో సందేహాల నివృత్తికోసం గతంలో ఏర్పాటుచేసిన కిసాన్‌ కాల్‌ సెంటర్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చారు. రైతులకు తలెత్తే సందేహాలను టోల్‌ఫ్రీ నెంబరు 18001204209కు ఫోన్‌చేసి, నివృత్తి చేసుకోవచ్చని వర్సిటీ విస్తరణ విభాగ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.వెంకటనాయుడు సూచించారు. పాడి పశువుల పోషణ, పునరుత్పత్తి, పాలు, మాంస ఉత్పత్తుల తయారీ, కోళ్లు, పందులు, గొర్రెలు, మేకల పెంపకం, వర్సిటీలో ఆఫర్‌చేసే వివిధ కోర్సులు తదితర సమాచారం పొందవచ్చన్నారు.  ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. 

Updated Date - 2021-11-28T07:11:11+05:30 IST