
హైదరాబాద్: సంస్కరణల పేరుతో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీఆర్వోలు భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడినా కొత్త ఉద్యోగాలను భర్తీ చేయలేదని మండిపడ్డారు. డిప్యూటీ తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కిషన్‌రెడ్డి తెలిపారు.