
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ దీక్షలు పెట్టారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దీక్ష పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూశారని ఆరోపించారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ రాజకీయ డ్రామాలకు తెరదించాలని, లేదంటే టీఆర్ఎస్ డ్రామాలకు ప్రజలే తెరదించుతారని అన్నారు. టీఆర్ఎస్వి రైతు దీక్షలు కాదని.. రాజకీయ దీక్షలని విమర్శించారు. కేసీఆర్ రాజకీయ నాటకమాడుతున్నారని, ఢిల్లీలో దీక్ష చేసి లబ్ది పొందాలనుకున్నారని, సీఎం డ్రామాలకు జనం తెరదించుతారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి