గత రబీలో కేసీఆర్ ధాన్యాన్ని ఎందుకు ఇవ్వలేదు?: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-21T19:52:44+05:30 IST

గత రబీలో సీఎం కేసీఆర్ ధాన్యాన్ని ఎందుకు ఇవ్వలేదు? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

గత రబీలో కేసీఆర్ ధాన్యాన్ని ఎందుకు ఇవ్వలేదు?: కిషన్‌రెడ్డి

ఢిల్లీ: గత రబీలో సీఎం కేసీఆర్ ధాన్యాన్ని ఎందుకు ఇవ్వలేదు? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని తెలంగాణ ప్రభుత్వమే లేఖ రాసిందన్నారు.రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ కలిపి 27.39 లక్షల మెట్రిక్‌ టన్నుల సరఫరా చేయాలన్నారు.ఎఫ్‌సీఐకి ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు.సీఎం కేసీఆర్‌ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హుజురాబాద్‌ ఓటమి తర్వాతే కేసీఆర్‌ బియ్యం అంశం లేవనెత్తారన్నారు.మెడపై కత్తిపెట్టి రాయించుకున్నారని కేంద్రంపై దుష్ర్పచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.రా రైస్‌ ఎంత వస్తే అంత కొంటామని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌  చెప్పారన్నారు. జనవరి నుంచి జులై 31 వరకు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రంతో ఒప్పందం చేసుకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-12-21T19:52:44+05:30 IST