
ఆదిభట్ల: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనపై ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తండ్రీ కుమారులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవినీతి అరాచక పాలన సాగిస్తున్నారని అన్నారు. వారి అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబపాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్రంపై బురదజల్లే కుట్రకు తెరలేపారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.