ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2021-02-24T06:35:11+05:30 IST

చక్కెర కలిపిన నీటిలో బంగారు వస్తువులను అరగంట నానబెట్టాలి. ఆతర్వాత సబ్బునీటితో కడిగేస్తే మెరుపులు చిందిస్తాయి. బంగాళాదుంపలు ఉడికించిన నీటితో వెండి వస్తువులను తోమితే వాటిపై మరకలు పోతాయి...

ఇలా చేసి చూడండి!

  1. చక్కెర కలిపిన నీటిలో బంగారు వస్తువులను అరగంట నానబెట్టాలి. ఆతర్వాత సబ్బునీటితో కడిగేస్తే మెరుపులు చిందిస్తాయి.
  2. బంగాళాదుంపలు ఉడికించిన నీటితో వెండి  వస్తువులను తోమితే వాటిపై మరకలు పోతాయి.
  3. పింగాణీ పాత్రలను ఉప్పు, నిమ్మరసం వేసి తయారుచేసిన మిశ్రమంతో తోమితే  మల్లెపూవులా మెరుస్తాయి.
  4. కొద్దిగా వెనిగర్‌లో బియ్యప్పిండి వేసి దాంతో ఇత్తడి సామాన్లను తోమితే తళ తళలాడతాయి.
  5. బాగా జిడ్డు పట్టిన పాత్రలను వెనిగర్‌తో తోమితే జిడ్డు పూర్తిగా పోతుంది. 
  6. బాగా ఖరీదైన తెల్లని లెదర్‌ బ్యాగు మీద ఇంకు చుక్కలు పడితే ఎంతో బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ మరకమీద కొద్దిగా టూత్‌ పేస్టును రాసి పావుగంట అలాగే ఉంచాలి. ఆ తర్వాత  బ్రష్‌తో ఆ ప్రదేశంలో బాగా రుద్దితే బ్యాగు మీది ఇంకు మరక పోతుంది.

Updated Date - 2021-02-24T06:35:11+05:30 IST