న్యూజిలాండ్‌లో పదోన్నతి పొందిన భారత సంతతి మహిళ!

ABN , First Publish Date - 2021-03-07T01:39:22+05:30 IST

న్యూజిలాండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న భారత సంతతికి చెందిన మహిళకు పదోన్నతి లభించింది. కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మన్‌దీప్ కౌర్ సింధూ.. సీనియర్ సార్జెంట్‌గా పదోన్నతి పొం

న్యూజిలాండ్‌లో పదోన్నతి పొందిన భారత సంతతి మహిళ!

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న భారత సంతతికి చెందిన మహిళకు పదోన్నతి లభించింది. కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మన్‌దీప్ కౌర్ సింధూ..  సీనియర్ సార్జెంట్‌గా పదోన్నతి పొందారు. న్యూజిలాండ్ పోలీస్ కమిషనర్ ఆండ్రూ కోస్టర్.. ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించి.. అందుకు సంబంధించిన బ్యాడ్జ్‌ను మన్‌దీప్ కౌర్ సింధూకు అందించారు. కాగా.. పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ కౌర్ సింధూ.. 2004లో న్యూజిలాండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. దీంతో న్యూజిలాండ్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన తొలి భారత సంతతి మహిళ‌గా ఆమె గుర్తింపు పొందారు. గతంలో ఆమె న్యూజిలాండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని పలు విభాగాల్లో పని చేశారు. ఈ సందర్భంగా మన్‌దీప్ కౌర్ సింధూ మాట్లాడుతూ..పోలీస్ ఉద్యోగంపై చిన్నతనం నుంచే ఇష్టాన్ని పెంచుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో కష్టపడి ఉద్యోగాన్ని పొందినట్టు చెప్పారు. 


Updated Date - 2021-03-07T01:39:22+05:30 IST