ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తున్నాం

Nov 28 2021 @ 00:04AM
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ శశాంక, జిల్లా అధికారులు

- జిల్లాలో 230 కేంద్రాలను ఏర్పాటు చేశాం

- రైతుల కోసం 33 లక్షల గన్నీబ్యాగులు సిద్ధం

- సీఎస్‌కు వివరించిన కలె
క్టర్‌ శశాంక 

మహబూబాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లను పటిష్టంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ శశాంక ఉన్నతాధికారులకు నివేదించారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌తో వడ్ల కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా శశాంక నివేదిస్తూ జిల్లాలో 230 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటిద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్యాడిక్లీనర్లు, మాయిశ్చర్‌ మీటర్లు, ఎలకా్ట్రనిక్‌ వేయింగ్‌ మిషన్లు, ధాన్యం తడవకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో 30 టార్ఫాలీన్లు ఏర్పాటు చేయ డం జరిగిందన్నారు. జిల్లాలో 33 లక్షల గన్నీబ్యాగులు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. 17 తేమశాతం ఉన్న ధాన్యానికి టోకెన్లు జారీ చేసి తక్షణమే కొనుగోలు చేసి ట్యాబ్‌లో నమోదు చేసి రవాణా చేస్తున్నామన్నారు. 

సీఎస్‌ సోమే్‌షకుమార్‌ మాట్లాడుతూ భారత ఆహార సంస్థ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో.. తెలంగాణలో పండే ధాన్యం పారబాయిల్డ్‌ కోసం మాత్రమే వినియోగిస్తున్నందున వరిపంట వేయరాదని, రైతు వేదికల ద్వారా అవగాహన పర్చాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు అందజేస్తున్నామన్నారు. ఈ వీసీలో ఏఎస్పీ యోగే్‌షగౌతమ్‌, జిల్లా అధికారులు సన్యాసయ్య, చతృనాయక్‌, మహేందర్‌, నర్సింగరావు, ఖర్షీద్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

పరిశ్రమల స్థాపనతో ఉపాధి..

యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల స్ధాపనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పరిశ్రమల స్ధాపనలపై జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోసమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఎ్‌సఐపాస్‌ కింద ఆన్‌లైన్‌ ప్రక్రియద్వారా 43 దరఖాస్తులు స్వీకరించగా 38 ఎంపిక చేయడం జరిగిందని, అందులో 32 శాఖ పరంగా పరిశీలన జరిపి మంజూరి చేశామన్నారు. మరో ఐదు దరఖాస్తులు శాఖ పరంగా పరిశీలనలో ఉన్నాయని మొత్తంగా ఒక్క దరఖాస్తును మాత్రమే తిరస్కరించడం జరిగిందన్నారు. జిల్లా పరిశ్రమల అధికారి సత్యనారాయణ, గిరిజనాభివృద్ధి అధికారి దిలీ్‌పకుమార్‌, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ బాలరాజు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాఘవేంద్రరావు పాల్గొన్నారు.

ఓటరు నమోదు ప్రక్రియ పరిశీలన..

మహబూబాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని కలెక్టర్‌ శశాంక ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఓటుహక్కు పొందెందుకు మార్పులు, చేర్పులు, సవరణలు వంటి వాటికి దరఖాస్తులు అం దిస్తూ రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఇంటింటికి తిరిగి దరఖాస్తులు అందించే ప్రక్రియ చేపడితే ఓటు హక్కు నమోదు శాతం పెంచవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రంజిత్‌, బీఎల్వో లలిత తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.