ఎంపీ రఘురామ అరెస్టు అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2021-05-15T05:39:22+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 14: ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం పాలకులకు పరిపాటిగా మారిందని, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రశ్నించిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును అక్రమ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కాకినాడ సిటీ మాజీ

ఎంపీ రఘురామ అరెస్టు అప్రజాస్వామికం

సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి  

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 14: ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం పాలకులకు పరిపాటిగా మారిందని, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రశ్నించిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును అక్రమ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తీవ్రంగా ఖం డించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అరాచక, అవినీతి పాలనపై ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారన్నారు. ఇది సీఎం జగన్‌ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. కృష్ణంరాజును అరెస్టు చేసేందుకు కేటాయించిన సమయం రాష్ట్ర సరిహద్దులో కొవిడ్‌ బాధితులతో నిలిచిపోయిన అంబులెన్స్‌ల అనుమతుల కోసం ప్రయత్నించి ఉంటే కొందరి ప్రాణాలు నిలిచేవన్నారు. కరోనా నియంత్రణలో ప్రభు త్వం పూర్తిగా విఫలం చెందిందని  కొండబాబు విమర్శించారు. ప్రతిపక్ష నేతలను వైసీపీ మంత్రులు, ఎమ్మె ల్యేలు తీవ్ర అసభ్యకర మాటలతో బహిరంగంగా దూషించినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన విమర్శించారు. 

Updated Date - 2021-05-15T05:39:22+05:30 IST