ఆన్సైట్‌ కంపోస్టింగ్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2021-07-24T05:32:46+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), జూలై 23: కార్పొరేట్‌ వ్యాపార రంగాలు నేషనల్‌ ట్రిబ్యునల్‌ సూచనల ప్రకారం ఆన్సైట్‌ కంపోస్టింగ్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, బల్క్‌ జనరేటర్స్‌ వంటి యాంత్రిక సహకారం తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పేర్కొన్నారు. శుక్రవారం జీఆర్‌టీగ్రాండ్‌ హోటల్‌ను సందర్శించిన ఆయన హోటల్‌ వ్యర్థాల శుద్ధీకరణ చేసే విధానాన్ని ప

ఆన్సైట్‌ కంపోస్టింగ్‌ తప్పనిసరి
జీఆర్‌టీగ్రాండ్‌ హోటల్‌ను పరిశీలిస్తున్న కమిషనర్‌

కాకినాడ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ 

కార్పొరేషన్‌ (కాకినాడ), జూలై 23: కార్పొరేట్‌ వ్యాపార రంగాలు నేషనల్‌ ట్రిబ్యునల్‌ సూచనల ప్రకారం ఆన్సైట్‌ కంపోస్టింగ్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, బల్క్‌ జనరేటర్స్‌ వంటి యాంత్రిక సహకారం తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పేర్కొన్నారు. శుక్రవారం జీఆర్‌టీగ్రాండ్‌ హోటల్‌ను సందర్శించిన ఆయన హోటల్‌ వ్యర్థాల శుద్ధీకరణ చేసే విధానాన్ని పరిశీలించారు. చెత్తను డంపింగ్‌ యార్డ్‌కు తరలించే అవకాశం లేనందున కార్పొరేట్‌ వ్యాపారలన్నీ చెత్తను ఘన, ద్రవ వ్యర్థాలుగా శుద్ధి చేయాలన్నారు. ఆన్‌సైట్‌ కంపోస్టింగ్‌ విధానంలో వ్యర్థాల ద్వారా సేంద్రియ ఏరువును తయారు చేయవచ్చని కమిషనర్‌ తెలిపారు. కార్యక్రమంలో మాధవి, విరుపాక్ష పాల్గొన్నారు. 44వ వార్డు మెహర్‌నగర్‌ సచివాలయాన్ని కమిషనర్‌ పరిశీలించారు. సచివాలయ కార్యదర్శుల బయోమెట్రిక్‌ హాజరును పరిశీలించి ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ కార్యదర్శుల పనితీరును వారు నిర్వహిస్తున్న రిజస్టర్‌ను పరిశీలించానని, అర్హతగల ప్రతి లబ్ధిదారుడు లబ్ధిపొందేలా సేవలు అందించాలన్నారు. ఇకపై సచివాలయ పనితీరు మెరుగుపడకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. విక్టోరియా వాటర్‌వర్క్స్‌ ప్రాం తాన్ని, ఆనుకుని ఉన్న కాలువ పూడికతీతను కమిషనర్‌ పరిశీలించారు. పక్కనే నిర్మాణాలు చేపడుతున్న వాటి నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్లకు ఆయన సూచించారు. 

Updated Date - 2021-07-24T05:32:46+05:30 IST