ప్రభుత్వం ధరల బాదుడుతో బేజారు

ABN , First Publish Date - 2022-06-29T06:09:07+05:30 IST

కాకినాడ సిటీ, జూన్‌ 28: రాష్ట్ర ప్రభుత్వం ధరల బాదుడుతో ప్రజలు బేజారెత్తిపోతున్నారని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు చార్జీలపై నిరసనగా బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళవారం 27వ డివిజన్‌లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కొండబా బు మాట్లాడుతూ వైసీపీ మూడేళ్ల పాలననలో సామాన్యుడి కి అందలేనంతగా నిత్యావసర వస్తువులు

ప్రభుత్వం ధరల బాదుడుతో బేజారు
బాదుడే బాదుడు కార్యక్రమంలో కొండబాబు

సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు 

కాకినాడ సిటీ, జూన్‌ 28: రాష్ట్ర ప్రభుత్వం ధరల బాదుడుతో ప్రజలు బేజారెత్తిపోతున్నారని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు చార్జీలపై నిరసనగా బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళవారం 27వ డివిజన్‌లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కొండబా బు మాట్లాడుతూ వైసీపీ మూడేళ్ల పాలననలో సామాన్యుడి కి అందలేనంతగా నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు మూడింతలు పెరిగాయన్నారు. కార్యక్రమంలో తుమ్మల రమేష్‌, కోడూరి పెద్ద, తులసి ప్రసాద్‌, ఊదా శ్రీను, శివ, విసంశెట్టి బాబి, చింతలపూడి రవి, రెడ్నం సత్తిబాబు, అమలకంటి బలరాం, తుమ్మ ల సత్తిబాబు, బంగారు సత్యనారాయణ రిక్కల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

చురుకుగా సభ్యత్వ నమోదు

సిటీలో చురుకుగా పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు కొనసాగుతుందని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడించారు. మంగళవా రం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌చార్జిలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి జూమ్‌కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కొండబాబు మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లోను బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రూరల్‌ నాయకుడు పేరాబత్తుల రాజశేఖర్‌, పలివెల రవి అనంతకుమార్‌, తుమ్మల రమేష్‌, పంతాడి రాజు, వొమ్మి బాలాజీ, ఎస్‌కే రహీమ్‌, చింతలపూడి రవి పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T06:09:07+05:30 IST