జీజీహెచ్‌లో రూ.1.45 కోట్లతో పీఎస్‌ఏ యూనిట్‌

ABN , First Publish Date - 2021-03-03T07:24:00+05:30 IST

జీజీహెచ్‌ (కాకినాడ), మార్చి 2: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్‌)లో ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్ప్‌షన్‌ (పీఎస్‌ఏ) యూనిట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం మైంది. ఈ విభాగానికి సంబంధించిన పీఎస్‌ఏ పరికరం మంగళవారం జీజీహెచ్‌కు చేరుకుంది. సహజమైన గాలిని శుద్ధిచేసి రోగులకు ప్రాణవాయువు (ఆక్సిజన్‌)ను అం దించే ఈ పీఎస్‌ఏ పరికరాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిరాక్స్‌ సంస్థ రూ. 1.45 కోట్ల నిధులతో

జీజీహెచ్‌లో రూ.1.45 కోట్లతో పీఎస్‌ఏ యూనిట్‌

ఇక సహజసిద్ధమైన ఆక్సిజన్‌ అందించే ఏర్పాటు

జీజీహెచ్‌ (కాకినాడ), మార్చి 2: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్‌)లో ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్ప్‌షన్‌ (పీఎస్‌ఏ) యూనిట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం మైంది. ఈ విభాగానికి సంబంధించిన పీఎస్‌ఏ పరికరం మంగళవారం జీజీహెచ్‌కు చేరుకుంది. సహజమైన గాలిని శుద్ధిచేసి రోగులకు ప్రాణవాయువు (ఆక్సిజన్‌)ను అం దించే ఈ పీఎస్‌ఏ పరికరాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిరాక్స్‌ సంస్థ రూ. 1.45 కోట్ల నిధులతో ఆసుపత్రికి సమకూర్చింది. ఇది నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌లో నిల్వ చేసిన ఆక్సిజన్‌ని ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరిన రోగులు, ఆపరేషన్లు, ప్రాణాపాయంలో ఉన్న రోగులకు వినియోగిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే పీఎస్‌ఏ యూనిట్‌ని ఆసుపత్రి ప్రాంగణంలోని సీటీ స్కాన్‌ విభాగం పక్కన ఏర్పాటు చేస్తున్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రావుల మహాలక్ష్మి తెలిపారు. ఇందుకు సంబంధించిన యూనిట్‌ నిర్మాణం ఏపీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నా రు. పీఎస్‌ఏ యూనిట్‌ అందుబాటులోకి రావడంతో నిరంతరంగా ఆక్సిజన్‌ సరఫరా ఉంటుందన్నారు. మరింతమందికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వీలుంటుందని, త్వరలోనే సంబంధిత ఇంజనీర్లు ఈ పరికరాన్ని బిగించనున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-03-03T07:24:00+05:30 IST