సిబ్బంది అందుబాటులో ఉండాలి

ABN , First Publish Date - 2022-08-17T05:57:46+05:30 IST

జేఎన్టీయూకే, ఆగస్టు 16: వర్శిటీలోని విభాగాల్లో బోధన, బోధనేతర సిబ్బంది అంతా విద్యార్ధులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండాలని జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు సూచించారు. వర్శిటీలోని ఎంబీఏ, హ్యూమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ విభాగాలను వీసీ మంగళవారం సందర్శిం

సిబ్బంది అందుబాటులో ఉండాలి
హాజరుపట్టీని పరిశీలిస్తున్న వీసీ

జేఎన్టీయూకే వీసీ ప్రసాదరాజు

జేఎన్టీయూకే, ఆగస్టు 16: వర్శిటీలోని విభాగాల్లో బోధన, బోధనేతర సిబ్బంది అంతా విద్యార్ధులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండాలని జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు సూచించారు. వర్శిటీలోని ఎంబీఏ, హ్యూమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ విభాగాలను వీసీ మంగళవారం సందర్శించారు. విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడి విభాగంలో పాఠ్యాంశాల బోధన, పరిశ్రమల సందర్శన, ప్రాజెక్టులు, కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించి అందుబాటులోలేని ఇద్దరు బోధనేతర సిబ్బంది నుంచి వివరాలను తీసుకోవాలని సంబంధిత విభాగ అధికారులను అదేశించారు. వీసీ వెంట రెక్టార్‌ కేవీరమణ, అధ్యాపకులు ఉన్నారు. 

Updated Date - 2022-08-17T05:57:46+05:30 IST