ఓటీఎస్‌తో సంపూర్ణ గృహహక్కు

ABN , First Publish Date - 2022-01-23T05:17:50+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 22: ఓటీఎస్‌ పథకం ద్వారా సంపూర్ణ గృహహక్కు పొందాలని నగర మేయర్‌ సుంకర శివప్రసన్న సూచించారు. 14వ వార్డు ఏటిమొగ కమ్యూనిటీ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పఽథ కం మెగా ఓటీఎస్‌ మేళాలో లబ్ధి

ఓటీఎస్‌తో సంపూర్ణ గృహహక్కు
కాకినాడలో లబ్ధిదారులకు ఓటీఎస్‌ పత్రాలు అందజేస్తున్న మేయర్‌, డిప్యూటీ మేయర్‌

కాకినాడ మేయర్‌ సుంకర శివప్రసన్న 

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 22: ఓటీఎస్‌ పథకం ద్వారా సంపూర్ణ గృహహక్కు పొందాలని నగర మేయర్‌ సుంకర శివప్రసన్న సూచించారు. 14వ వార్డు ఏటిమొగ కమ్యూనిటీ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పఽథ కం మెగా ఓటీఎస్‌ మేళాలో లబ్ధిదారులకు మేయర్‌ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చోడిపల్లి సత్యప్రసాద్‌, కార్పొరేటర్లు నల్లబిల్లి సుజాత, పినపోతు సత్తిబాబు, చవ్వాకుల రాంబాబు, టీపీఆర్‌వో కృష్ణమోహన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T05:17:50+05:30 IST