నడకుదురులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి
నడకుదురు (కరప), మార్చి 27: క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్తిబాబు సూచించారు. నడకుదురులో ఆదివారం జరిగిన పార్టీ గ్రామ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ అరాచక పాలనను ఎండగట్టాలని సూచించారు. టీడీపీ మండలాధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బుంగా సింహాద్రి, గండి వెంకటేశ్వరరావు, చీపురుపల్లి జయేంద్రబాబు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.