కోహ్లీ రికార్డును బద్దలుగొట్టిన కేఎల్ రాహుల్

ABN , First Publish Date - 2020-02-02T23:01:08+05:30 IST

టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో 45

కోహ్లీ రికార్డును బద్దలుగొట్టిన కేఎల్ రాహుల్

మౌంట్ మాంగనుయ్: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో 45 పరుగులు చేసిన రాహుల్ ఈ సిరీస్‌లో మొత్తం 224 పరుగులు చేశాడు. ఫలితంగా ఓ సిరీస్‌లో అత్యధిక  పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ పేరుపై ఉంది. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కోహ్లీ 199 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అదే రికార్డు కాగా, ఇప్పుడా రికార్డును రాహుల్ అధిగమించాడు. ఈ సిరీస్‌లో రాహుల్ 56 సగటు, 144.51 స్ట్రైక్ రేట్‌తో 224 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో 56 పరుగులు చేసిన రాహుల్ ఆ తర్వాత వరుసగా 57, 27, 39, 45 పరుగులు చేశాడు.  


ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో కివీస్ బోల్తా పడింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసి పరాజయాలను పరిపూర్ణం చేసింది.

Updated Date - 2020-02-02T23:01:08+05:30 IST