మోకాళ్ల నొప్పులకు సమర్థమైన వైద్యం ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా చికిత్స

Oct 20 2020 @ 11:25AM

ఆంధ్రజ్యోతి(20-10-2020)

వయసు మళ్లిన వారిలో ఎక్కువగా కొన్ని రకాల అనారోగ్యాలు తరచుగా కనిపిస్తాయి. వారిలో సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. ఈ సమస్య వారిలో జీవితం పట్ల నిరాశకు దారి తీస్తుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి ఉపశమనం పొందే విధంగా నూతన వైద్య విధానం ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా చికిత్స అందుబాటులో ఉంది. ఈ చికిత్సలో పేషంట్‌ రక్తంలోని ప్లాస్మాను సంగ్రహించి ఈ సమస్యతో బాధపడుతున్న వారి మోకాలు భాగంలో ప్రవేశపెట్టి చికిత్స చేస్తారు. ఈ విధ ంగా చేయడం వల్ల వారు సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొంది, వారి జీవితంలో సరికొత్త ఆశ చిగురిస్తుంది. 


మోకాళ్ల నొప్పులు మనం ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్య. ముఖ్యంగా వృద్ధులలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. యువకులలో, క్రీడాకారులలో గాయాల వల్ల, స్థూలకాయుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ  సమస్య కీళ్ల ప్రాంతంలోని గాయాలు, స్నాయువు గాయాలు లేదా బుర్సిటిస్‌ వంటి వాటి వల్ల ప్రభావితమవుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌ అనేది మృదులాస్థి అరిగిపోవడం వల్ల సంభవిస్తుంది. వృద్ధాప్యంలో మృదులాస్థి అరుగుదల వల్ల అధిక బరువు మోకాలు భాగంలో నిర్ధిష్టమయి ఈ సమస్య ఎక్కువవుతుంది. 


ఈ సమస్య ఉన్నవారికి ప్రారంభ దశలో మెట్లు ఎక్కేటప్పుడు, నడిచినప్పుడు మోకాలు నొప్పి కలుగుతుంది. ఆ తరువాతా క్రమేపీ కీళ్ల వాపు, మోకాలు ఎర్రబడటం, బలహీనంగా తయారవడం, ఆ తరువాత భరించలేని నొప్పి మోకాలు మొత్తం వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియ సుమారు 2-5 సంవత్సరాల వ్యవధిలో జరుగుతుంది. మోకాలు నొప్పి ప్రార ంభంలో రోగులు ఫిజియోథెరపిస్ట్‌ సలహా మేరకు కొన్ని రకాల శారీరక వ్యాయామాలు చేస్తారు. మరొకొందరు నొప్పి తగ్గడానికి పెయిన్‌ కిల్లర్లు వాడతారు. ఇలా చేయడం వల్ల తరువాతి దశలలో వారు పెయిన్‌ కిల్లర్‌లకు బానిస అవుతారు. ఈ మందులు ప్రారంభంలో కలిగే రోగలక్షణాల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. వీటితో మూత్రపిండాలు పాడయ్యే ప్రమాదం ఉంది. ఇలా చేయడం వల్ల పూర్తిగా మోకాలుని మార్పిడి చేయాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది.


ఈ సమస్యకి సమర్థమైన ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా(పీఆర్‌పీ) చికిత్స  అందుబాటులోకి వచ్చేవరకూ మిగతా చికిత్సలు అంత ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ఈ చికిత్స ద్వారా ఆపరేషన్‌ లేకుండానే శాశ్వత పరిష్కారం దొరకుతుంది. రోగుల  రక్తాన్ని (20-30మి.లీ) తీసుకొని, ఒక ప్రత్యేకమైన పరిజ్ఞానం కలిగిన పరికరంతో వృద్ధి కారకాన్ని సేకరిస్తారు. ప్లేట్‌లెట్స్‌లో చాలా వృద్ధి కారకాలు ఉన్నాయి. వీటిని దెబ్బతిన్న కణజాలంలోకి ఇంజెక్ట్‌ చేసినప్పుడు, దెబ్బతిన్న కణజాలాన్ని రిపేర్‌ చేయడానికి ఈ వృద్ధి కారకం సహాయపడుతుంది. ఈ చర్య ఆరోగ్యకరమైన కణజాలం పునరుత్పత్తి అయి, క్షీణించిన మృదులాస్థితో చేరి, దానిని ఆరోగ్యవంతమైన కణజాలంతో మరమ్మతు చేయడానికి సహాయపడుతుంది. ఈ విధానంలో ఏర్పడే నొప్పి, మంట తగ్గడానికి, మృదులాస్థి పూర్తి పునరుత్పత్తికి దాదాపు మూడు నెలలు పడుతుంది.

డాక్టర్‌ సుధీర్‌ దారా 

ఫౌండర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఏషియాన్‌ ఇంటర్‌నేషనల్‌ పేయిన్‌ స్పెషలిస్ట్‌.

4వ అంతస్తు, అపురూప పిసిసిహెచ్‌, రోడ్‌ నెం.2, బంజారాహిల్స్‌. హైదరాబాద్‌.

కాల్‌: 8466044441, 040 48554444. 

epionepainandspine.com

[email protected]


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.