గొరవయ్యల సందడి

ABN , First Publish Date - 2020-10-30T10:38:02+05:30 IST

దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో భాగంగా గురువారం భక్తుల కోలాహలం నడుమ గొరవయ్యల నృత్య ప్రదర్శన సాగింది.

గొరవయ్యల సందడి

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

గొలుసు తెంచిన గాదిలింగ


ఆలూరు రూరల్‌(హొళగుంద), అక్టోబరు 29: దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో భాగంగా గురువారం భక్తుల కోలాహలం నడుమ గొరవయ్యల నృత్య ప్రదర్శన సాగింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. వేదపండితులు నిర్ణయించిన సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు బల్లూరుకు చెందిన గొరవయ్య గాదిలింగ ఇనుప గొలుసును 23వ ప్రయత్నంలో తెంపి అబ్బురపరిచారు. గొలుసు తెంచే కార్యక్రమాన్ని వీక్షించేందుకు మహిళలు, చిన్నారులు కూడా గుమిగూడారు. సాయంత్రం దేవదాసీల క్రీడలు ఆకట్టుకున్నాయి. బన్ని ఉత్సవాల్లో చివరి ఘట్టమైన వసంతోత్సవంలో శుక్రవారం భక్తులపై గొరవయ్యలు రంగులను చల్లి కంకణ విసర్జన చేయిస్తారు. అంతటితో బన్ని ఉత్సవాలు ముగుస్తాయి. వేడుకల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఆస్పరి, హొళగుంద ఎస్‌ఐలు గిరిబాబు, విజయ్‌ కుమార్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-10-30T10:38:02+05:30 IST