Mobile Charging: బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో ఛార్జింగ్ పెడుతుంటారా..? ఓ మహిళకు ఎదురైన షాకింగ్ అనుభవం గురించి తెలిస్తే..

ABN , First Publish Date - 2022-09-26T21:05:21+05:30 IST

బయట ప్రాంతాలకు వెళ్లినపుడు బస్టాండ్‌, రైల్వే స్టేషన్ల వంటి పబ్లిక్ ప్లేస్‌లలో ఉండే ఛార్జింగ్ పాయింట్లలో చాలా మంది తమ మొబైల్స్‌కు ఛార్జింగ్ పెడుతుంటారు.

Mobile Charging: బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో ఛార్జింగ్ పెడుతుంటారా..? ఓ మహిళకు ఎదురైన షాకింగ్ అనుభవం గురించి తెలిస్తే..

బయట ప్రాంతాలకు వెళ్లినపుడు బస్టాండ్‌, రైల్వే స్టేషన్లు వంటి పబ్లిక్ ప్లేస్‌లలో ఉండే  ఛార్జింగ్ పాయింట్లలో చాలా మంది తమ మొబైల్స్‌కు ఛార్జింగ్ పెడుతుంటారు. అయితే అలా చేయడం చాలా సమస్యలను తెచ్చి పెడుతుందని చాలా మందికి తెలియదు. అలా పబ్లిక్ ప్లేస్‌లలో తమ మొబైల్స్ ఛార్జింగ్ చేసుకున్న చాలా మంది సమస్యల బారిన పడ్డారు. హైదరాబాద్‌లోని ఓ కంపెనీ సీఈవో రైల్వే స్టేషన్‌లో ఛార్జింగ్ పెట్టినపుడు అతడి మొబైల్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసి అతని ఖాతా నుంచి 16 లక్షల రూపాయలను కొట్టేశారు. 


ఇది కూడా చదవండి..

Anand Mahindra: ఈ మ్యారేజ్ హాల్ ఐడియా అదుర్స్.. ఆసక్తికర వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా



అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సైబర్ పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. మొబైల్ ఛార్జర్ ద్వారా ఫోన్ డేటాను చోరీ చేసినట్టు గుర్తించారు. రైల్వే స్టేషన్‌లో అతను ఛార్జింగ్ పెట్టుకున్న ఛార్జర్‌లో ముందుగానే ఓ చిప్ ఇన్‌స్టాల్ అయి ఉంది. దానితో ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు అది మొబైల్‌లోని మొత్తం డేటాను కాపీ చేసింది. ఇలా చేయడాన్ని జ్యూస్ జాకింగ్ (juice jacking) అంటారు. అలా ఆ సీఈవోకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కాయి. ఇక, రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ యువతి కూడా అలాంటి హ్యాకింగ్ బారినే పడింది. యువిక అనే యువతి కొన్ని రోజుల క్రితం తన అత్తతో కలిసి బెంగళూరు వెళ్లింది. ఆ ప్రయాణంలో, ఆమె చాలా సార్లు పబ్లిక్ ప్లేస్‌లలోని ఛార్జింగ్ పాయింట్ల నుంచి తన ఫోన్‌ను ఛార్జ్ చేసింది. 


ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు హ్యాకర్లకు చిక్కాయి. వాటిల్లో యువిక తన భర్తతో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు కూడా ఉన్నాయి. దాంతో హ్యాకర్లు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో పెడతామని హ్యాకర్లు భయపెట్టారు. దీంతో యువిక, తన భర్తతో కలిసి బెంగళూరు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువిక కూడా జ్యూస్ జాకింగ్ బాధితురాలేనని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-09-26T21:05:21+05:30 IST