కొన్ని రైల్వే స్టేషన్ల పేర్ల ముందు సెంట్రల్ అని ఎందుకు ఉంటుంది? ఎక్కడా లేని విధంగా టెర్మినల్ స్టేషన్లలో కనిపించే ప్రత్యేకత ఏమిటో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-04T13:08:50+05:30 IST

మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ రూట్‌లో అనేక స్టేషన్లను..

కొన్ని రైల్వే స్టేషన్ల పేర్ల ముందు సెంట్రల్ అని ఎందుకు ఉంటుంది? ఎక్కడా లేని విధంగా టెర్మినల్ స్టేషన్లలో కనిపించే ప్రత్యేకత ఏమిటో తెలుసా?

దేశంలోని పలు నగరాల్లోగల రైల్వే స్టేషన్ల పేర్లు ఆ నగరం పేరుతోనే ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే  కొన్ని నగరాల్లోని రైల్వే స్టేషన్ల పేర్లలో సెంట్రల్ అనే పదాన్ని జత చేరుస్తారు. దీని వెనుకగల కారణమేమిటో మీకు తెలుసా?

మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ రూట్‌లో అనేక స్టేషన్లను చూసేవుంటారు. ఆయా ప్రాంతాల పేర్లు అక్కడ కనిపిస్తాయి. అయితే కొన్ని రైల్వే స్టేషనల్లో సెంట్రల్ అనే పదం కనిపిస్తుంది. ఉదాహరణకు ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్ కాన్పూర్ సెంట్రల్... ఇలా ఉంటాయి. ఈ విధంగా స్టేషన్ పేరు తర్వాత సెంట్రల్ అని ఎందుకు ఉంటుందో తెలుసా? 



సెంట్రల్ స్టేషన్ అంటే అది ఆ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన, రద్దీగా ఉండే స్టేషన్ అని అర్థం. గతంలో సెంట్రల్ స్టేషన్ అనేదానిని రద్దీ ఆధారంగా గుర్తించేవారు. అంతేగానీ ఆ నగరంలో మూడు నాలుగు స్టేషన్లు ఉంటే.. వాటిలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్‌కి సెంట్రల్ అని పేరు పెట్టారని భావించకూడదు. ఉదాహరణకు ఢిల్లీ గురించి మాట్లాడుకుంటే.. ఢిల్లీలో చాలా స్టేషన్లు ఉన్నాయి. అయితే న్యూఢిల్లీ స్టేషన్ అత్యంత రద్దీగా ఉండే స్టేషన్. ఢిల్లీలో ఎక్కడా సెంట్రల్ స్టేషన్ అనేది లేదు. దీని ప్రకారం ప్రతి నగరానికి సెంట్రల్ స్టేషన్ ఉండవలసిన అవసరం లేదని గమనించాలి. అలాగే టెర్మినస్ లేదా టెర్మినల్ స్టేషన్ల మధ్య తేడా లేదు. టెర్మినల్ అంటే రైళ్లు అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి ట్రాక్ లేని స్టేషన్ అని అర్థం. అంటే రైళ్లు అక్కడికి వచ్చాక.. తదుపరి ప్రయాణానికి అవి వచ్చిన దిశలోనే తిరిగి వెళ్లాల్సివుంటుంది. అంటే రైలు ఒక దిశలో మాత్రమే ప్రయాణిస్తుందని అర్థం.

Updated Date - 2022-01-04T13:08:50+05:30 IST