పౌష్టికాహారంపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2022-09-25T05:13:11+05:30 IST

పిల్లలు, పెద్దలు అందరూ పౌష్టికాహార విలువలపై అవగాహన కలిగి ఉండాలని శ్రీవెంకటేశ్వ ర పశు వైద్య కళాశాల ఇన్‌ఛార్జ్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ నాగమల్లేశ్వరి పేర్కొన్నారు.

పౌష్టికాహారంపై అవగాహన అవసరం
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జ్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ నాగమల్లేశ్వరి

పశువైద్య కళాశాల ఇన్‌ఛార్జ్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ నాగమల్లేశ్వరి

ప్రొద్దుటూరు రూరల్‌, సెప్టెంబర్‌ 24: పిల్లలు, పెద్దలు అందరూ పౌష్టికాహార విలువలపై అవగాహన కలిగి ఉండాలని శ్రీవెంకటేశ్వ ర పశు వైద్య కళాశాల ఇన్‌ఛార్జ్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ నాగమల్లేశ్వరి పేర్కొన్నారు.  గోపవ రం పంచాయతీ పాఠశాలలో శనివారం ‘మహిళల ఆరోగ్యం - పిల్లల విద్య’ అంశంపై ఎన్‌ఎ్‌స ఎ్‌స ప్రోగ్రాం ఆఫీసర్‌ ఆధ్వర్యంలో నిర్వహించి న అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడు తూ ఆరోగ్య సూత్రాలు, పౌష్టికాహార ఆవశ్యకత పిల్లలకు చదువుకు కావాల్సిన వ్యాయామ, ఆహార, క్రమశిక్షణ విలువలను వివరించారు. జాతీయ సేవా పథకం ప్రాముఖ్యతను ఎన్‌ఎ్‌సఎ్‌స విభాగం సేవా నిరతిని తెలుపుతూ ఈ నెలను పౌష్టికాహార నెలగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహార విలువలను తెలుసుకుని పోషక విలువలున్న పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.

గర్భి ణుల, పిల్లల పోషణపై శిక్షణ కోసం రెండు డా క్యుమెంటేషన్లను కళాశాల ఎన్‌ఎ్‌సఎ్‌ఫ వలంటీ ర్లు వివరించారు. అనంతరం పౌష్టికాహార విలువలను అనారోగ్య పీడితులకు తెలియజెప్పే ప్ర యత్నంలో భాగంగా ఆహార విలువలపై కొన్ని పోస్టర్లను వలంటీర్లు స్థానిక పబ్లిక్‌ హెల్త్‌ సెం టరులో ఆవిష్కరించి గోడలకు అంటించారు. కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ కళ్యాణి, చక్కెర, రక్తపోటు నివారణ వైద్య నిపుణులు డాక్టర్‌ శంకర్‌రెడ్డి, పోషణ శా స్త్ర నిపుణులు డాక్టర్‌ రమే్‌షరాజు, డాక్టర్‌ ప్ర శాంత్‌, డాక్టర్‌ సాయి దిలీ్‌పగుప్త, డాక్టర్‌ సాయి జనరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T05:13:11+05:30 IST